Thursday, December 11, 2014

నిజమా !

వరించి,మోహించి,కనులార నల్లనయ్యను గాంచనెంచి,తనివితీర బిగికౌగిలి 


బంధించనెంచి,బృందావనికేతెంచి,వేచిచూచి,మల్లెపొదలమాటున శోధించి,


అటునిటు గమనించి,లేడని భావించి,రాడేమోయని క్షొభించి,అటుపై తనుగాంచి 


ఉల్లము సంతసించి,రాసలీల ఆరంభించిన వైనముగాంచి ముదమునొందె విరించి

Saturday, November 29, 2014

అన్నిటా నీవే

కంటి బడబానలమునందు నిను అటు వైశ్వానరమునందు


కంటి మహొగ్రనదమునందు నిను కొండంచు ఝరులయందు


కంటి ప్రచండపవనములందు నిను మలయమారుతమునందు


కంటి అటునిటుకంటి అందు మది నినుకనుగొంటి కౌస్తుభకంఠి

Monday, November 24, 2014

ప్రహ్లదవరద నరసింహ ఇల యేలు నా హ్రుదయసీమ

ఏ రూపము కూడదని నరహరి రూపమ్ము దాల్చినావు 


ఏ అస్త్రము కూడదని నఖముల ఉదరమ్ము తెగచీల్చినావు


ఏ చొట కూడదని గడపను చేరి ప్రాణమ్ము కడతేర్చినావు


అట్టి ప్రహ్లదవరద నరసింహ ఇల యేలు నా హ్రుదయసీమ

Friday, November 21, 2014

దీనినే తార్కాణమందామా??

భవబంధముల భావన ఎంతవారినైన బంధించునని 


మనసునెంచి మనిషి మెలగవలయు, తర్కము


నెంచ, తపమాచరించిన భరతుడు హరిని మరిచి


హరిణముతో చరియించిన చరితము తార్కాణము కాదా!

Thursday, November 20, 2014

నిజంగానే జరిగినదా

దాటగా తగిలిన తలుపును గని 


తావచ్చి తగిలెనని కాలివేలిని చూపించ


లేదని వేసిన మంత్రమునకే తగ్గెనని


ఆటలాడ పరుగిడె తల్లి యశోద మురవగ 


ఇదో చిత్రమైన యోచన ఇలా ఆ బాలకృష్ణుడికి జరిగియుండదా అనే ఒక 

చిన్నఆలోచన తప్పయితే క్షమించండి.     

Sunday, November 16, 2014

నా విన్నపం

అహము అంతమొందించి, ఆత్మ శొధన పెంచి, ఇహమునందు


సేవచేయు అవకాశమిచ్చి, తలపులోన నిలిచి, తగు జ్ఞానమిచ్చి,


బరువు బాధ్యతల్ తొలగించి, మోక్షమార్గమున్ తరలించి కావుము 


నను ఆర్తత్రాణ పరాయణా! లక్ష్మీరమణా! శ్రీమన్నారాయణా!

Saturday, November 15, 2014

దీనుడ నే కృష్ణా

చనుపాలు తాగిన పుణ్యాన పూతన సద్గతుల నొసంగినావు 


నీవాడిన పుణ్యాన కాళీయు పక్షీంద్రు బారి రక్షించినావు


ద్విజుపిలుపు వినినంత చేరి రుక్మిణి కరము చెపట్టితివీవు


ఏ రీతి నే చెసితినని ఈ దీను మదినెంచి బ్రోతువో కదా కృష్ణా