Thursday, October 30, 2014

మోక్ష కాంక్ష

కాంక్షతో, స్వామీ! నీ కరుణాకటాక్షములకు 


అక్షరముల మాల అల్లితి నీదు, వీక్షించి, లక్షణముల


పరీక్షించి, నన్ను అక్షయముగ పరిరక్షించి


మోక్షమొసంగెదవని మది నమ్మితి లక్ష్మీరమణా


మిత్రుడొకడు  'క్ష' తో పద్యము రాయమంటే చిన్న ప్రయత్నం.  పెద్దలు

తప్పులను సవరించగలరు.   

కృష్ణుడి బాల్య క్రీడా ?

కొంగును పట్టి ఆడించిన ఆ బాలుడు క్రీడకు 


ఆగుపడి అగుపడనట్టుల ఆటలు ఆడె 


నిజముగా ఆ నల్లనివాడు లోకమునే చూడకున్న 


గోకులమేమి సకల భూతలమే చీకటి కాదా

Wednesday, October 29, 2014

నా పాప మొదటి స్కూల్ రోజు

నా కూతురు మొదటి రోజు స్కూల్ వెళ్ళినప్పుడు నా మదిలో వెలసిన

భావాలు 


చిన్ని చిన్ని చిన్నారులు బుజ్జి బుజ్జి పాపాయిలు


వెళ్ళిరి పాఠశాలకు పెద్దలు జీవిత పోరాటశాలకు


తనువెక్కడ వున్నను మనసేమో అక్కడే


ఒడిలోని పాప బడిలొన చేప 


నీ(నో)రు లెదని అయ్యో మది నీరసించె

Tuesday, October 28, 2014

కుచేల సఖుడా శ్రీకృష్ణుడు

యదువంశజుండు,రుక్మిణీవల్లభుండు, ద్వారకావిభుండు, మిత్రుండు


తనను కనునో, వినునో, వెతల్ కనుగొనునో, కష్టముల్ బ్రావునో అనియెంచి


చెదరిన బ్రతుకుల చిరిగిన దుస్తుల తొలచిన తలపుల నిచ్చిన అటుకుల 


కొచ్చిన భోగభాగ్యముల తలచి మదిప్రార్థించిన కుచేలసఖుడే దిక్కు నాకీ ఇలన్

Thursday, October 23, 2014

కారణము ఏమి రామచంద్రా

కావలయునా నీకు వానరసాయము సీతమ్మజాడ వెతుకునపుడు


కావలయునా నీకు ఉడుత సాయము వారధి నిర్మించునపుడు


కావలయునా నీకు విభీషణు సాయము దశకంఠు దునుమాడునపుదు


కావలయునన్న కారణము కావవలయునన్న కాంక్షకాక వేరేదీ కాదే

Wednesday, October 22, 2014

చిన్ని కృష్ణుడు

అల్లన ఎత్తున పెట్టిన ఉట్టిని కొట్టి 


చాటుగ దాచిన నున్నని వెన్నెను పట్టి 


పరుండిన గోపిక మూతికి పెట్టి 


చిలిపిగ నవ్వెను యశోద ముద్దుల పట్టి

Tuesday, October 21, 2014

తల్లీ నా చిన్ని కోరిక

అలతి అలతి పదముల పద్యములల్లి


కొలుతు కొలుతు నిన్ను మనమునందు


తొలచి తొలచి అందు భావమెంచి


కదులు కదులు నీవు నా పదములందు

ఇంకోటి మరి

మనమును తొలచి వాడిన పదముల వేడిమి తగ్గి


నే వేసిన శరములకటా అశరీరములయ్యె


తప్పదు ఇక ఖేదము చెందక మది మధించి నే


సం(స్పం)ధించకున్న రణమున నిలువలేము నిక్కము కదా

Monday, October 20, 2014

ఇంకో పద్యం

ఆ దెవి నా చేత నాటించు ఈ పదవిత్తనములు యెదిగి పద్యమే 


కలువ చంపకముల్ పూయునో కంద మకరందమే వచ్చునో


మత్తకోకిల పాడునో ఆటవెలదులె ఆడునో లేక సీసంబు చూచునో 


గజకేసరుల్ చరింతురో అంతయు ఇక నీ కరుణా కటాక్షమే తల్లీ

Sunday, October 19, 2014

ఒక చిన్ని కవిత

సరి సరి యనుమాట కొసరి కొసరి వడ్డించ


గడసరి వైరియైన సరియే అనడే


జీవితము సరిగమలగు ఇది మగసిరి 


గల మాట అనుట సరియా కాదా

Friday, October 17, 2014

తపము చేయలేదు నా తనువు శోషింపలేదు

తెలవారి నే లేచి సంధ్య వార్చలేదు మడి ఉండలేదు


తరచి తరచి నే పుణ్యతీర్థముల్ దర్శించలేదు


తెలిసి నీ నామమే తలచితి త్రాణయొసగు శ్రీరామచంద్రా

Thursday, October 16, 2014

తలతునునే గిరి జామాతను గిరిజా మాతను

తలతును గొవర్ధన గిరిధారిని తన దేవేరిని


తలతును సత్యలొక నివాసిని సరస్వతిని


తలతునునే వారిని ఎల్లవేళల తదాత్మ్యమునన్



నేను వీలైనంత వరకు పద్యాలను తెలుగులోనే మరియు దేవునిపైనే రాయ 

ప్రయత్నిస్తాను 

నాకు ఇవి ఏవి చందోబద్దముగా ఉండవు నాకు ఆ కళ ఇంకా రాదు అని 

తెలిసినా నాకు నచ్చిన వచ్చిన చిన్న చిన్న పదాలతో భావాన్ని అల్ల 

ప్రయత్నిస్తాను 

తప్పులుంటే నేర్పించండి దిద్దండి 

ఎందుకంటే ఇందులో నేను కేవలం బాలుడినని తెలుసు నాneurosurgery 

లో  అందునా గవర్నమెంట్ ఆసుపత్రి  పనిలో దొరికే ఫ్రీ టైం చాలా తక్కువనీ 

తెలుసు సహృదయతతో ఒప్పుకొంటారని తప్పులెన్ని తప్పుదోవ 

పట్టకుండా నిరోదిస్తారని ఆశిస్తున్నాను 

Wednesday, October 15, 2014

నేను రాసుకున్న మొదటి పద్యం

తల కట్టుట  నేర్చితి నే

తల కుట్తుట దీర్ఘ కాలముగ చేయుచుంటి

తల లొన చూచి యుంటి 
కాని 

తలపులను చూచుట ఇంకను నా తరము కాదె





hahaha

ఇది నా మొదటి ఆలొచన 


I am a neurosurgeon by profession

ఏదో వ్రాయాలంటే ఇదే తట్టింది మరి


తల పండిన పదాలు వ్రాయలంటే తలకాయ పదాలే వస్తున్నాయి ఏమిటొ

నమస్కారములు 


అందరికి నా నమస్కారములు 

నేను వృత్తి రీత్యా డాక్టర్ను 

I Work as asst prof of neurosurgery in Kurnool medical college Kurnool.

వృత్తిలో ఎన్ని ఉన్న మనసులో తెలుగుపై వున్నా ప్రేమతో పద్యాలు /కవితలు వ్రాయాలని ఆరాట పడుతుంటాను 
  
నా రాతలు మిమ్ములను మెప్పిస్తాయనే నా ఆశ