Saturday, November 29, 2014

అన్నిటా నీవే

కంటి బడబానలమునందు నిను అటు వైశ్వానరమునందు


కంటి మహొగ్రనదమునందు నిను కొండంచు ఝరులయందు


కంటి ప్రచండపవనములందు నిను మలయమారుతమునందు


కంటి అటునిటుకంటి అందు మది నినుకనుగొంటి కౌస్తుభకంఠి

Monday, November 24, 2014

ప్రహ్లదవరద నరసింహ ఇల యేలు నా హ్రుదయసీమ

ఏ రూపము కూడదని నరహరి రూపమ్ము దాల్చినావు 


ఏ అస్త్రము కూడదని నఖముల ఉదరమ్ము తెగచీల్చినావు


ఏ చొట కూడదని గడపను చేరి ప్రాణమ్ము కడతేర్చినావు


అట్టి ప్రహ్లదవరద నరసింహ ఇల యేలు నా హ్రుదయసీమ

Friday, November 21, 2014

దీనినే తార్కాణమందామా??

భవబంధముల భావన ఎంతవారినైన బంధించునని 


మనసునెంచి మనిషి మెలగవలయు, తర్కము


నెంచ, తపమాచరించిన భరతుడు హరిని మరిచి


హరిణముతో చరియించిన చరితము తార్కాణము కాదా!

Thursday, November 20, 2014

నిజంగానే జరిగినదా

దాటగా తగిలిన తలుపును గని 


తావచ్చి తగిలెనని కాలివేలిని చూపించ


లేదని వేసిన మంత్రమునకే తగ్గెనని


ఆటలాడ పరుగిడె తల్లి యశోద మురవగ 


ఇదో చిత్రమైన యోచన ఇలా ఆ బాలకృష్ణుడికి జరిగియుండదా అనే ఒక 

చిన్నఆలోచన తప్పయితే క్షమించండి.     

Sunday, November 16, 2014

నా విన్నపం

అహము అంతమొందించి, ఆత్మ శొధన పెంచి, ఇహమునందు


సేవచేయు అవకాశమిచ్చి, తలపులోన నిలిచి, తగు జ్ఞానమిచ్చి,


బరువు బాధ్యతల్ తొలగించి, మోక్షమార్గమున్ తరలించి కావుము 


నను ఆర్తత్రాణ పరాయణా! లక్ష్మీరమణా! శ్రీమన్నారాయణా!

Saturday, November 15, 2014

దీనుడ నే కృష్ణా

చనుపాలు తాగిన పుణ్యాన పూతన సద్గతుల నొసంగినావు 


నీవాడిన పుణ్యాన కాళీయు పక్షీంద్రు బారి రక్షించినావు


ద్విజుపిలుపు వినినంత చేరి రుక్మిణి కరము చెపట్టితివీవు


ఏ రీతి నే చెసితినని ఈ దీను మదినెంచి బ్రోతువో కదా కృష్ణా

ప్రయత్నం త్వరలో ప్రారంభం

పెద్దల ఆశీర్వాదముతో త్వరలోనే రామాయణాన్ని నా పద్యమాలికలల్ల ప్రయత్నిస్తున్నాను

మీ అందరి దీవెనలు ఉంటాయనే నమ్మకం 

Friday, November 14, 2014

అన్ని నీవే

పంచాక్షరిలొని ఫలితంబు నీవే


అష్టాక్షరిలొని మూలము నీవే


ద్వాదశాక్షరిలొనున్న దారి నీవే


అంతటను నిను దర్శించు దృష్టినీవే

Thursday, November 13, 2014

దేవుని కోరికా ??

కమలభవుడు కోరి నా నొసట వ్రాసిన పిమ్మట


హంసవాహన చేరి నా నోట పలుకు మాట


గరుడగమను చరిత విహరించ మనెనీ చొట


భవబంధముల ననుకావుమని కొలుచు బాట

Wednesday, November 12, 2014

ఒక చిన్న విన్నపం

దయచేసి ఎవరైనా ఎలావుందో , ఎలా రాస్తున్నానో చెబుతారా 

గజేంద్ర మోక్షమా !!

మానసమనెడి గజము మదమునొంద,


కష్టముల మకరి బిగియార ఒడిసిపట్ట,


పోరాడి ఓడి మది పాహియని ప్రార్థింప,


ననుబ్రోవగ తలచితివో మదినేలుదేవా.

Monday, November 10, 2014

నవ విధ భక్తి మార్గములు

 నవవిధ భక్తి మార్గాలని ఇమిడింప నా ప్రయత్నం




నీదు నామమె శ్రవణానందమై నీ కీర్తనలు యెలుగెత్తి నే పాడ 


సదా నిను ధ్యానించి నీ పాదముల సేవించి నీదు అర్చన చేసి 


భక్తితొ కైమొడ్చి నీదు దాసుడనై జీవించి ఆత్మ నివేదన చేసెద 


భక్తుడిననొ పుత్రుడిననొ మిత్రుడిననొ నెపమునెంచి నను కావుము తండ్రి

Monday, November 3, 2014

కృష్ణా మన్ను తిన్నావా

తిన్నాడని మన్ను అన్న రామన్న కన్నతల్లికి తెలుప 


ఏదన్నా! చిన్నా! నా చిట్టికన్నా!చూపుము నీ నోరును


నా నాన్నా! అన, ముసి ముసి వన్నెల చిన్నెల నగవుల 


మాటున చూపిన మిన్నును కన్న తల్లి జన్మ ధన్యతనొన్దె




పోతనలా కాకపోయినా ఏదో నా ప్రయత్నం 

Saturday, November 1, 2014

కన్నయ్యా ఏమయ్యా

పాటలు గాధలు చరితలు పాడుతు 


ఆలించి లాలించి పాలిచ్చి నిదురబుచ్చి 


అలసిసొలసి తల్లి తూలిన మరుక్షణమున 


చిన్నికృష్ణుడు లేచి ఆడసాగె కేరింతలతో